calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమృత్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలి

11-04-2025 12:06:55 AM

అర్బన్ ఎమ్మెల్యే  దన్‌పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి కార్యక్రమాల విషయమై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర .ప్రభుత్వల నుండి  ఇందూర్ కార్పొరేషన్ కి అమృత్ -2 పథకం ద్వారా జరుగుతున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 162 కోట్లు,వాటర్ సప్లై 217 కోట్ల మంజూరు అయినా పనులపై సమీక్షా  జరిపారు.

నగరంలో 150 మాన్ హోల్స్ పునః నిర్మాణం చేసినట్లు అలాగే 45 కొత్త వాటి నిర్మాణం చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేసినట్లు తెలిపారు.  వాటర్ సప్లై కొరకు రెండు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పనులు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే కు  వివరించారు.

వర్షాకాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలనీ పనులు పూర్తి నాణ్యతతో చేయాలనీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

వేసవి కాలంలో నగర వాసులు మంచినీటికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలని మంచినీటి ట్యాంక్ లు నాలా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతం చేసి వేసవిలోగ పూర్తి చేసి ప్రజా ఉపయోగంలో తేవాలని సూచించారు. సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.