calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా అమృత్ భారత్ పనులు

26-02-2025 01:46:42 AM

సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ 

వికారాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రైల్వే స్టేషన్ల సుందరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అమృత్ భారత్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. మంగళవారం భద్రతా తనిఖీల్లో భాగంగా ఆయన వికారాబాద్, తాం డూరు రైల్వే స్టేషన్లను సందర్శించారు.

అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వికారాబాద్ స్టేషన్ రూ.24 కోట్లతో, తాండూరు రూ.24 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జీఎంను కలిసి హైదరాబాద్ ప్యాసింజర్ చిట్టిగిద్ద రైల్వే స్టేషన్‌లో ఆపాలని కోరారు. హుబ్లీ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం, బీదర్, ఎల్‌టీటీ  రైళ్లను శంకర్‌పల్లిలో ఆపాలని కోరారు.