calender_icon.png 16 November, 2024 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుకుసాగని అమ్మ ఆదర్శ పాఠశాలలు

16-11-2024 12:00:00 AM

  1. వికారాబాద్ జిల్లాలో రూ.10.32 కోట్ల బకాయిలు 
  2. రెండేండ్లు గడుస్తున్నా అందని బిల్లులు 
  3. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు

వికారాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా పథకం తీరు ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినా, సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో పనుల్లో తీవ్రజాప్యం జరిగింది.

పాఠశాలల్లో మౌలిక వస తులు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని 2022లో అమలు చేశారు. తర్వాత రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం మన ఊరు మనబడి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలలను తీసుకొచ్చింది. పాఠశాలల అభివృద్ధి పనుల నిర్వహణ, సమస్యల పరిష్కార బాధ్యతను మహిళా సంఘాల చేతికి అప్పగించింది.

దీంతో మన ఊరు మనబడిలో ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి రావాల్సిన నిధులపై నీలినీడలు అలుముకున్నాయి. ఇటీవల సర్పంచు లు తలపెట్టిన ధర్నాలో 70 శాతం మంది సర్పంచులకు మన ఊరు మనబడి కింద చేపట్టిన పాఠశాలల పనుల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

371 పాఠశాలలు ఎంపిక..

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా లో మొదటి విడతలో 371 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ స్కూళ్లలో వసతుల కల్పనకు రూ.70.63 కోట్లు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇం దులో రూ.7 లక్షల నుంచి రూ.30లక్షల లోపు ఖర్చు అంచనా ఉన్న వాటిని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు.

ఇలా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 30 పాఠశాలల్లోనే వందశాతం పనులు పూర్తయ్యాయి. మరో 181 పాఠశాలల్లో 80 శాతం పూర్తికాగా, 160 స్కూళ్లలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. 80 శాతం పనులు పూర్తయిన వాటికి సంబంధించి ప్రభుత్వం అరకొర నిధులే ఇచ్చింది. దీంతో చేతినుంచి డబ్బులు పెట్టి పనులు చేయించిన ఎస్‌ఎంసీ చైర్మ న్లు, సర్పంచులు లబోదిబోమంటున్నారు. తమకు రా వాల్సిన డబ్బులను ఇవ్వాలని కోరుతున్నారు. 

రూ.10.32 కోట్లు పెండింగ్ బిల్లులు

మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి జిల్లాలో రూ.10.32 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డబ్బులు చెల్లిస్తే గానే మిగతా పనులు పూర్తి చేయలేమని కాంట్రాక్టులు తేల్చిచెబు తు న్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 11 నెలలు కావొస్తున్నా నేటికి డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఆం దోళన చెందుతున్నారు.

మన ఊరు మనబడి కింద చేపట్టిన పనుల బకాయిల విషయమై ఉన్నదాధికారులు ఆరునెలల క్రితమే ప్రభుత్వానికి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.