calender_icon.png 12 January, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి

10-12-2024 12:00:00 AM

రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగండి. చలికాలంలో రోజూ ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల అనేక జబ్బులకు చెక్ పెట్టొచ్చు. బరువును తగ్గించుకోవాలనుకుంటే క్రమంగా ఉసిరి రసం తీసుకోవచ్చు. ఇది జీవక్రియను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుం ది. అంతేకాదు.. గుండెకు కూడా మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఉసిరి రసం తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి.

అందుకే మన పెద్దవాళ్లు ఉసిరికాయ రసం తాగమని సలహా ఇస్తుంటారు. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరి రసంలో ఉండే అన్ని మూలకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉసిరి రసం తాగాలి. ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. క్రమంతప్పకుండా ఈ జ్యూస్ తాగడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా ఉసిరి బాగా పనిచేస్తుంది.