ముంబై, నవంబర్ 15: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్లో ఆయన హింగోలి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అధికారులు షా హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను షా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను బీజేపీ అనుసరిస్తుందని, అందరం ఎన్నికల వ్యవస్థకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కాగా, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే హెలకాప్టర్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.