calender_icon.png 21 December, 2024 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలి

21-12-2024 05:44:04 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు నిదర్శనం అన్నారు. అహంకార ధోరణితో బిజెపి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్ నాయకులు అబ్దుల్లా, వందన, రఫిక్, జమీర్, జావీద్, గంగారాం, దత్తు, మహేష్, శివప్రసాద్, గోపాల్ నాయక్, కిరణ్, రాము, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.