calender_icon.png 6 October, 2024 | 1:48 PM

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ

06-10-2024 11:14:46 AM

న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సోమవారం కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, ప్రభావిత రాష్ట్రాల హోం మంత్రులు, సీఎస్ లు, డీజీపీలు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపమాపడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది. త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు.

ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశముంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమీక్షకు ఒడిశా, బెంగాల్, బీహార్ మంత్రులు, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ మంత్రులు అధికారులు హాజరుకానున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధి విషయాలపై కీలకంగాచర్చించనున్నారు. ఈ భేటీకి కేంద్ర ఆరోగ్య, ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, గిరిజన వ్యవహారాలు, టెలీకమ్యూనికేషన్ శాఖల కార్యదర్శలు, తపాలా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులు హాజరుకానున్నారు.