25-04-2025 03:18:37 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో ఈనెల 22వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్లకు జారీ చేసిన వీసాలను రద్దు చేయడాన్ని హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలిఫోన్ సంభాషణలలో మాట్లాడిన అమిత్ షా రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించి వారిని వెనక్కి పంపాలని, అలాగే పాక్ పౌరులకు సంబంధించిన సమాచారని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.
పాక్ జాతీయులకు సమాచారని కేంద్రానికి అందిస్తే వారి అన్ని వీసాలను రద్దు చేసేందకు అవకాశం ఉంటుందని అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. సార్క్ వీసా న్న పాక్ పౌరులు తక్షణమే భారతదేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవలి ఉగ్రవాద సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించబడుతుంది.