calender_icon.png 23 December, 2024 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలి...

22-12-2024 07:47:14 PM

అంబేద్కర్ ను అవమానించడం అంటే బడుగు బలహీన వర్గాలను అవమానించడమే... 

అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ లో భారీ నిరసన... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సభ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగ్రహ జ్వాలలు రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆత్మగౌరవ ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా అమిత్ షా, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వర్గాల నాయకులు అగ్గిమల్ల గణేష్, గోడం గణేష్, నజీర్ అహ్మద్, సాజిదొద్దిన్, ప్రజ్ఞా కుమార్, సామల ప్రశాంత్, శోభ తుల్జాపురే, మౌలానా అస్లాం, షేక్ శిరాజ్, దాండుగే సందీప్, నిమ్మల ప్రశాంత్ తదితరులు ఉన్నారు.