నిర్మల్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాక్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుండి వెంటనే తొలగించాలని కోరుతూ నిర్మల్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు, అమిత్‌షా, మోడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతను అగౌరవ పరిచిన కేంద్రమంత్రి భారత ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్రాసిన రాజ్యాంగం ప్రకారం కేంద్రమంత్రిగా వ్యవరిస్తున్న అమిత్ షా తన వైకరి మార్చుకోవాని కోరారు. అనంతరం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్ను, ఆది, భీంరెడ్డి, అజార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.