calender_icon.png 26 December, 2024 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్‌షాను తొలగించాలి

25-12-2024 12:00:00 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 24: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రభుత్వ విప్, జగిత్యాల డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే రూపొందుతాయని, వాటి ప్రకారమే ఆయా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3,4 ను చేర్చడం వల్లనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందన్నారు.

ఇలాంటి రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ను చట్టసభలకు ఎన్నికైన వ్యక్తులు కించపరచడం శోచనీయమన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను కించపరిచే వారు ఎవరైనా శిక్షారులే నన్నారు. గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా తఢీ పార్ కు గురయ్యాడని అలాంటి నేర ప్రవృత్తి గల వ్యక్తి కేంద్ర హోం మంత్రి కావడం విచారకరమన్నారు. అంబేద్కర్ ను కించపరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను  ప్రధానమంత్రి మోడీ వెంటనే తన మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ నరసింగారావు, కృష్ణారావు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.