calender_icon.png 8 January, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి

31-12-2024 02:17:52 AM

* వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30(విజయక్రాంతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకొని కేంద్రమంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నారాయణగూడ వైఎంసీ వద్ద సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐఎంఎల్ మాస్‌లైన్, సీపీఐఎంఎల్ లిబరేషన్, ఎంసీపీఐయూ, ఎస్‌యూసీఐసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలందరూ ఖండిస్తున్నా, మంత్రులు, ప్రధాని స్పందించలేదన్నారు. పెత్తందారి ధోరణి, అధికార దర్ఫాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

సీపీఐ నాయకులు వలిఉల్లాఖాద్రీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు జేవీ చలపతిరావు, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకులు ప్రవీణ్, సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పాల్గొన్నారు.