calender_icon.png 2 January, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి

30-12-2024 02:23:46 AM

* అఖిలపక్షం నేతల డిమాండ్

ఆదిలాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తేవాలన్న ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలో భాగమే అమిత్  వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

  వామపక్షాల ఆధర్యంలో ఈ నెల 30న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ర్ట కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యదరి దరనాల మల్లేశ్ అధ్యక్షతన అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అనంతరం భార  రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బండారు రవి కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అనేకసార్లు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం తగదన్నారు. అంబేద్కర్ లౌకిక వాదీ కావడమే బీజేపీ దృష్టిలో నేరం అన్నారు. భిన్నతంలో ఏకతం కలిగిన దేశా  అగ్రవర్ణ ఆధిపత్య  హిందూ రాజ్యాంగ మార్చాలనే కుట్రలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

ఈ కుట్రను మెజార్టీ దేశ ప్రజలు సహించరని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను బలపరుస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం అన్యాయమన్నారు.