భువనగిరి ఎంపీ చామల
ఖమ్మం/జనగామ, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జనగామ డీసీసీ కార్యాల యంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఖమ్మంలో అఖిలపక్షాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నున్నా నాగేశ్వరరావు, భాగం హేమంతరావు, పుల్ల య్య, ఎస్.డి.హుస్సేన్, పొన్నం వెంకటేశ్వరరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.