calender_icon.png 13 March, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్‌షాను అరెస్టు చేయాలి

22-12-2024 01:35:34 AM

పీసీసీ మాజీ చీప్ వీ హనుమంతరావు 

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అరెస్టు చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. మూడు రోజులు ట్యాంక్‌బండ్ సమీంపలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం అంబర్‌పేటలోని పోలీస్‌స్టేషన్‌లో అమిత్‌షాపై ఫిర్యాదు చేశారు.

అంతకు ముందు పీఎస్ ఎదు ట నిరసన చేపట్టారు.  ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గురించి మాట్లాడటం అందరికీ ఫ్యాష న్ అయిందని, దేవుడిని స్మరించినా పుణ్యం వస్తుందని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

రాజ్యాంగ నిర్మాతను అవ మానించిన అమిత్‌షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాల ని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్ర మంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్‌యాదవ్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, ఖైర తాబాద్ డీసీసీ మహిళా విభాగం అధ్య క్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌గౌడ్  తదితరులున్నారు.