మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా శనివారం సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్‌షాను వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా రెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ పాల్గొన్నారు.