calender_icon.png 13 November, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

10-11-2024 01:44:13 PM

ముంబై: బాలాసాహెబ్ థాకరే, వీర్ సావర్కర్‌లను అవమానించిన కాంగ్రెస్‌తో పాటు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మేనిఫెస్టో ‘సంకల్ప్ పాత్ర’ను విడుదల చేసిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని కాంగ్రెస్ నాయకులు నిలకడగా అగౌరవపరిచారని, వీర్ సావర్కర్‌ను ప్రశంసించాల్సిందిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అభ్యర్థించాలని ఉద్ధవ్ ఠాక్రేకు షా సవాలు విసిరారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం నిషేధించిందని, ముస్లింలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మహారాష్ట్ర ప్రజలు సమర్థిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

మహారాష్ట్రలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో సమగ్ర నైపుణ్య గణన చేపడతామని హామీ ఇచ్చారు. మహిళల 'లఖ్ పతి దీదీ' పథకం విస్తరిస్తామన్నారు. ఎరువుపై జీఎస్టీ తిరిగి చెల్లించి, ఆర్థిక భారం తగ్గిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో పరిశ్రమల వృద్ధికి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. రూ. 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, మహారాష్ట్రలో వృద్ధుల పింఛన్ రూ. 2,100కు పెంచుతామని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.