calender_icon.png 7 October, 2024 | 3:56 PM

మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరింది

07-10-2024 01:43:12 PM

న్యూఢిల్లీ: మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల కీలక సమావేశం జరిగింది. ఈ సమీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ... 2024 లో 723 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 202 మంది మావోయిస్టులు మృతి చెందారని అమిత్ షా వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్ణిపెట్టామన్నారు. ఇప్పటి వరకు 13 వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని వెల్లడించారు.

దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా కోరారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందని అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా ఛత్తీస్ గఢ్ సీఎం, డీజీపీని అమిత్ షా అభినందించారు. ఛత్తీస్ గఢ్ లో కొందరు మావోయిస్టులు లొంగిపోయారని చెప్పిన అమిత్ షా పదేళ్లలో 11,500, కి. మీ మేర రోడ్ నెట్ వర్క్, పదేళ్లలో 15,300 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేశామన్నారు. 165 ఏకలవ్వ ఆదర్వ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో హింసాత్మక ఘటనలు 16,400కు పైగా జరిగాయి.. ప్రస్తుతం హింసాత్మక ఘటనలు 7,700కు తగ్గాయిని చెప్పారు. భవిష్యత్తులో హింసాత్మక ఘటనలు మరింత తగ్గుతాయని అమిత్ షా పేర్కొన్నారు.