కాంగ్రెస్, మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నా..?: మాలవీయ
న్యూఢిల్లీ: అదానీపై అమెరికాలో కేసు నమోదు అంశంపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పార్లమెంటు సమావేశాల ముందు అదానీపై కేసు ప్రస్తావన సమయంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైరాం రమేశ్ ప్రశ్నలకు బీజేపీ ఐటి విభాగాధిపతి ఎక్స్ లో సమాధానమిచ్చారు. అమెరికాలో పెట్టుబడిదారు సొరోస్ కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని మాలవీయ తెలిపారు. 2021-22 మధ్య లంచం ఇచ్చినట్లు చెబుతున్నారు. 2021-22 మధ్య ఏపీ, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ లో లంచమిచ్చినట్లు చెబుతున్నారు. 2021-22 మధ్య ఆ రాష్ట్రాల్లో విపక్షాలే అధికారంలో ఉన్నాయని మాలవీయ ఆరోపించారు. 2021-22 కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో డీఎంకే, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నాయా..? అని ఆయన ప్రశ్నించారు.