10-04-2025 01:55:32 AM
దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులు
ఫిర్యాదు చేస్తేనే చర్యలు
మామూళ్ల మత్తులో అధికారులు
శాశ్వత పరిష్కారం వైపు అడుగులేయని జిల్లా అధికారులు
తెరవెనుక ఉన్నతాధికారుల హస్తం ?
సంగారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి):కంటికి కనిపించింది ప్రభుత్వ స్థలమా.. ప్రైవేట్ స్థలమా అన్నది సంబంధం లేకుండా కబ్జాదారులు తెగబడుతున్నారు. రాత్రికి రాత్రే బెస్మెన్ట్లు నిర్మించడం.. ప్రభుత్వ స్థలాన్ని కాజేయడం కబ్జాదారుల పనైతే.. అందినకాడికి పుచ్చుకొని చేతులు దులుపుకోవడం అధికారుల వంతు అవుతుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వ డం..
లేదా బేస్మింట్లను కూల్చి తామేదో స్ట్రిక్ట్ అధికారులమని గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయపడతానికే పరిమితం అవుతున్నారు. ఇదంతా షరా మామూలే అయిన ప్పటికీ కబ్జాదారుల ఆగడాలు ఆగడం లేదు. అధికారుల నిద్రావస్థ వీడడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి తప్పించుకొంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
మొత్తానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లో పం, వారికంటే కిందిస్థాయి అధికారులే పెత్తనం చెలాయించడం వల్ల అధికార వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ తప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ప టాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ గడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారి ప్రభుత్వ భూ ములు అన్యాక్రాంతం అవుతున్నా కళ్ళు మూసుకుంటున్నారనేఆరోపణలుఉన్నాయి.
సర్కార్ భూమి కనుమరుగు?
పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాం తాలు కబ్జాదారులకు అడ్డాగా మారాయి. ప్రధానంగా అమీన్పూర్ ప్రాంతం ప్రభుత్వ స్థలాల కబ్జాకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీగా రూపాంతం చెందకముందు ఉన్న ప్రభుత్వ భూములు మున్సిపాలిటీ అయ్యాక ఈ ప్రాంతంలో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి.
ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్లు వ్యవహరించడం అధికారులకు పరిపాటిగా మారింది. సమస్య తీవ్రతరం దాల్చడంతో తామేదో నిజాయితీ గల అధికారులమని నిరూపించుకోవడానికి నోటీసులు, కూల్చివేతలుచేపడుతున్నారు.
కట్టుదిట్టమైన చర్యలేవి..?
ప్రధానంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు కాపాడడంలో విఫలం చెందుతున్నారు. అవినీతి, అక్రమాలకు పా ల్పడుతున్న రెవెన్యూ అధికారులపై కొరడా ఝుళిపించినా తిరిగి ఇక్కడ పోస్టింగ్ వేయించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నారు. ఒకదశలో అధికారులకు ఈ ప్రాంతం కల్పతరువుగా మారిందనే చెప్పవచ్చు.
కబ్జాదారుల నుంచి కావాల్సినంత దండుకొని ఉన్నతాధికారులను సైతం మచ్చిక చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జాదారుల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడడమే కాకుండా శాశ్వత పరి ష్కారం దిశగా జిల్లా పాలనాధికారులు కృషి చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి చుట్టూ కంచె వేసి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాల్సిన అధికారులు వారికే అండగా నిలుస్తు న్నారనేది నిజం.
తూతూ మంత్రంగా కూల్చివేతలు...
ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్లో సర్వే నంబర్ 30లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అసలు కబ్జాదారులు అధికారుల అండలేకుండానే నిర్మాణాలు చేపట్టారా అనేది అర్థంకాని విషయం.
ఫిర్యాదులు అందితేనే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులకు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన కనీస బాధ్యత లేదాని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అమీన్పూర్ ప్రాంతంలో మిగిలిన ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.