26-04-2025 09:02:14 PM
కలెక్టర్ క్రాంతి వల్లూరు..
రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ భూముల పరిశీలన..
ఫెన్సింగ్ వేసి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..
పటాన్ చెరు: అమీన్ పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు(District Collector Kranthi Valluru) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్ పూర్ మండలానికి సంబంధించిన ప్రభుత్వ భూముల వివరాల మ్యాప్ ను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సర్వే నంబర్ 993 ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించిన స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగిస్తారని, వాటికి ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.