calender_icon.png 25 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా అడ్మిషన్ల ఆలస్యంపై తేల్చేందుకు అమికస్ క్యూరీ

23-07-2024 01:32:14 AM

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): లా కోర్సు అడ్మిషన్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతున్నదని హైకోర్టు ప్రశ్నించింది. జాప్యంపై కారణాలు, అందుకు ఎవరు బాధ్యులో తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించింది. కోర్టుకు సహాయకారిగా వ్యవహరించాలని సీనియర్ అడ్వొకేట్ పీ శ్రీరఘురాంను నియమించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ అనిల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. లా అడ్మిషన్లు 2023 ఏడాదికి ఆలస్యం కావడంపై లాయర్ ఏ భాస్కర్‌రెడ్డి వేసిన పిల్‌ను బెంచ్ సోమవారం విచారించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్ అదేశ్వరశర్మ వాదిస్తూ లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ మేరకు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. కాలేజీలకు బార్ కౌన్సిల్ ఇస్తుందని తెలిపారు. అడ్మిషన్లను యూజీసీ పర్యవేక్షించాలని ఆయన చెప్పడాన్ని రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకించారు. తదుపరి విచారణను కోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది.