calender_icon.png 12 October, 2024 | 4:43 PM

బంగ్లాతో అమీ తుమీ..

30-09-2024 12:00:00 AM

* 4 - ఇరు జట్లు నాలుగు సార్లు ఫైనల్లో పోటీ పడగా భారత్ మూడు సార్లు, బంగ్లా ఓ సారి విజయం సాధించాయి

నేడే సాఫ్ ఫుట్‌బాల్ కప్ ఫైనల్

థింపు: సాఫ్ అండర్017 ఫుట్‌బాల్ కప్ ఫైనల్ నేడు జరగనుంది. భారత యువ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూపు స్టేజ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో ఆడినపుడు 1-0 తేడాతో విజయం సాధించింది. మరి నేటి ఫైనల్ పోరులో మన కుర్రాళ్లు ఏం చేస్తారో.. భారత్ ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ ట్రోఫీని ఒడిసిపట్టింది. అంతే కాకుండా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్.. భారత్ సెమీస్‌లో నేపాల్ మీద, బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద నెగ్గాయి.