calender_icon.png 19 September, 2024 | 7:21 AM

అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేత

09-09-2024 12:00:00 AM

  1. అధికారికంగా ప్రకటించిన హౌతీ రెబల్స్ గ్రూప్
  2. యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: హౌతీల నియంత్రణలో ఉన్న యెమెన్ గగనతలంలో ఎగురుతున్న అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ ‘ఎమ్‌క్యూ రహిత విమానం)ను కూల్చివేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా యెమెన్ భూభాగంపై అమెరికా నిఘా పెట్టినట్లు ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే యెమన్ దేశ ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు చెందిన పలు విమానాలు, డ్రోన్లు.. ఇక్కడి గగనతలంలో విహరిస్తూ నిఘా చేపడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.

అంతేకాకుండా ఆయా డ్రోన్లు యెమెన్‌కు వ్యతిరేకంగా శత్రు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. 2014లో యెమన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకుంది మొదలు.. అమెరికాకు చెందిన పలు స్పై విమానాలను కూల్చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ హౌతీలు కూల్చివేశారు. కాగా పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మద్దతుగా హౌతీ రెబల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం ఇలాంటి దాడులను కొనసాగిస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.