calender_icon.png 29 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా ఉద్యోగుల్లో గుబులు

29-11-2024 02:15:57 AM

ఫేక్ జాబ్స్ తొలగింపులను ప్రారంభించిన మస్క్!

న్యూఢిల్లీ, నవంబర్ 28: అమెరికా రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కీలకంగా వ్యహరిస్తున్నారు. ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు చేపట్టనున్న ఆయన ఇప్పటికే తన విధులు నిర్వర్తించడం ప్రారంభించారు. తాజాగా మస్క్ చేసిన పోస్ట్‌తో ఫెడరల్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెం దిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియెన్సీ సంయుక్త సారథులుగా నియమించారు.

ఈ శాఖ ను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వ వ్యవస్థలో మస్క్, వివేక్ మార్పులు తెస్తారని తాను ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా బాధ్యతలు చేపట్టకముందే మస్క్ తన పనిని మొదలుపెట్టారు. ఫేక్ జాబ్స్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. మూకుమ్మడి తొలగింపులకు పిలుపునిచ్చారు. పర్యావరణ సంబంధిత విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి పేర్లు, వారి వివరాలతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. ఫెంటాసిల్ హ్యాండిల్‌లో తొలుత ఆ వివరాలు పోస్ట్ అయ్యా యి. దాంతో ఆ సిబ్బంది నెగెటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నారు. చివరకు ఒకరు తన సోషల్ మీడియా అకౌంట్‌ను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులను భయపెట్టేందుకే మస్క్ ఈ తరహా వ్యూహాలను అమలు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లె ఆరోపించారు.