calender_icon.png 9 January, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె లేని అమెరికా

07-12-2024 01:52:55 AM

మహిళలకు పీఠం అందని ద్రాక్షే 

* ఏళ్లయినా మారని తంతు

న్యూఢిల్లీ, నవంబర్ 6: రెండున్నర శతాబ్దాల ప్రజాస్వామ్య చరిత్ర కలిగిన అమెరికాలో మహిళకు మాత్రం అత్యున్నత ప్రాధాన్యం  దక్కడంలేదు. ఇన్నేళ్ల లో ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠం అధిరోహించలేదు. ఈసారైనా అగ్రరా జ్యానికి మహిళా సారథి వస్తుందని భావించినా అలా జరగలేదు. భారత సంతతి మహిళ కమలహ్యారిస్ ఎంతో పోరాడినా అధికారానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఎన్నో దేశాలను మగువలు పాలిస్తున్నా అమెరికాలో మాత్రం అది సాక్షాత్కారం కాలేదు. 

పోరాడినా కానీ.. 

అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా అంత సులభంగా లభించలేదు. ఎన్నో ఏళ్లు పోరాటం 1920లో దిగొచ్చిన ప్రభుత్వం కొంతమంది మహిళలకు అవకాశం దక్కింది. చివరికి 1960లలో అందరికీ అందింది. కానీ అమెరికా అధ్యక్ష పీఠంపై మాత్రం మగువలు ఇంతవరకూ కూర్చోలేకపోయారు. కొంతమంది మహిళా నేతలు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడేందుకే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. 

హిల్లరీ గెలిచినా.. 

2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై 30 లక్షల పాపులర్ ఓట్లు ఎక్కువ సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో ఆధిక్యం చూపి న ట్రంప్ అధ్యక్షుడయ్యారు. దీంతో హిల్లరీ ప్రజల ఆమోదం పొందినా అధ్య క్షురాలు కాలేకపోయారు.

అప్పటి నుంచే ప్రయత్నాలు

1964లో మార్గరేట్ స్మిత్ రిపబ్లికన్ తరఫున తొలిసారి అధ్యక్ష పోటీదారుగా నిలబడ్డారు. కానీ ఆమెకు అభ్యర్థిత్వమే దక్కలేదు. 19౭౨లో షెల్లీ చిసమ్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించినా ఆమెకు మొండిచేయ్యే ఎదురైంది. 1980లలో ఫెమిని జం తారస్థా యికి చేరిన కాలంలో డెమోక్రాట్ నేత గెరాల్డిన్ ఫెరారో అధ్యక్ష అభ్యర్థిగా నిలిచింది. కానీ ఆమెకు మాత్రం శ్వేత సౌధం లోకి ఎంట్రీ లభించలేదు.  కమల, హిల్లరీ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది.