calender_icon.png 20 September, 2024 | 12:11 PM

అమెరికా బంధం బలోపేతం చేస్తా

09-09-2024 12:00:00 AM

  1. అమెరికాలో రాహుల్‌కు ఘన స్వాగతం 
  2. అర్థవంతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి

డల్లాస్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): అమెరికాలో అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడానికి ఆతృతతో ఎదురు చూస్తున్నానని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇండియా అమెరికా దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి తన పర్యటన సందర్భంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్న రాహుల్‌కు ఆదివారం డల్లాస్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన పర్యటన వివరాలు వెల్లడించారు. “ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు, ఎన్నారైల నుంచి డల్లాస్‌లో లభించిన ఆత్మీయ స్వాగతానికి సంతోషిస్తున్నాను.

అర్థవంతమైన చర్చల్లో పార్టిసిపేట్ కావడానికి ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్‌లో, 9,10 తేదీల్లో వాషింగ్టన్‌లో రాహుల్ పర్యటించనున్నారు. టెక్సాస్ యూనివర్సిటీలో స్టూడెంట్స్, విద్యావేత్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. జర్నలిస్టులు, ఐటీ నిపుణులు, బిజినెస్‌మెన్, తదత రులతో భేటీ కానున్నారు. క్యాపిటల్ హిల్స్‌లో పలువురిని కలుసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ఈ పర్యటనలో నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే మీడియా సమావేశంలో రాహుల్ పాల్గొంటారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తెలిపారు.