calender_icon.png 1 November, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాపై అమెరికా స్టెల్త్

29-07-2024 02:01:08 AM

  1. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై దాడికి రంగంలోకి స్టెల్త్ బాంబులు
  2. శత్రువుల విమాన వాహక నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం

న్యూఢిల్లీ, జూలై 28 : అగ్రరాజ్యం అమెరికా, డ్రాగెన్ కంట్రీ చైనా నువ్వా నేనా అన్నట్లుగా అణ్వస్త్రాల ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. ఓ పక్క విమాన వాహక నౌకలను పెంచుకునే దిశగా చైనా అడుగులు వేస్తుంటే.. మరోవైపు ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పేల్చేసే బాంబులను అమెరికా పరీక్షిస్తోంది. ఇందుకోసం బీ స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. రిమ్ ఆఫ్ ది పసిఫిక్ (రిమ్‌ప్యాక్) యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఈ నెల 19న హవాయి ద్వీపం వద్ద వీటిని పరీక్షించినట్లు అమెరికా నేవీ థర్డ్ ఫ్లీట్ ఓ ప్రకటనలో తెలిపింది.

“శత్రు దేశాల నుంచి వేగంగా ముంచుకొస్తున్న ముప్పును అతి తక్కువ వ్యయంతో ఎలా ధ్వంసం చేయాలనే అంశం పై సాధన చేశాం. ఇందుకు అనుగుణంగా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియన్లు పేల్చేసే బీ2 స్టెల్త్ బాంబర్లను పరీక్షిస్తున్నాం” అని వెల్లడించింది. అమెరికా 820 అడుగుల పొడవు, 39,000 టన్నుల బరువు గల ‘యూఎస్‌ఎస్ తర్వా’ అనే యాంఫీబియస్ నౌకపై బీ స్టెల్త్ బాం బర్, ఒక చౌకైన గైడెడ్ బాంబ్ ‘క్విక్‌సింక్’లను విజయవంతంగా ప్రయోగించింది. దీనిలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. 

నౌకలను ముంచగలిగే సామర్థ్యంతో..

అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం బీబౌ2 బాంబర్. ప్రతికూల పరిస్థితుల్లోనూ గగనతలం నుంచి బాంబులను ప్రయాణించగలదు. ఇది అత్యంత ఎత్తులో ఉన్నా యుద్ధక్షేత్రాన్ని స్పష్టంగా చూడగలదు. ఇక క్విక్ సింక్ బాంబు విషయానికి వస్తే.. దీని బరువు 2,000 పౌండ్లు ఉంటుంది. ఒక నౌకను ముంచగలిగే సామర్థ్యం దీని సొంతం. కానీ, అది ఉన్న ప్లేస్ శత్రువులకు సులభంగా తెలిసిపోతుంది. అదే, బీ2 స్టెల్త్ అయితే శత్రువులు గుర్తించలేరని ఎయిర్ ఫోర్స్ రీసెర్చి ల్యాబ్ పేర్కొంది. ఈ క్విక్ సింక్ బాంబులను 2022లో అమెరికా ఎఫ్ ఫైటర్ జెట్లతో కూడా ప్రయోగించి పరీక్షించింది.