17-02-2025 12:14:14 AM
అమృత్‌సర్‌లో దిగిన మరో వలసదారుల విమానం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి 112 మంది భారతీయులతో బయల్దేరిన మూడవ వలసదారుల విమానం ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో దిగింది.
ఈ 112 మందిలో 44 మంది హర్యానాకు చెందిన వారు ఉండగా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మూడు విమానాల్లో ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం భారత్‌కు తరలించిన అక్రమవలసదారుల సంఖ్య 332కు చేరింది.