calender_icon.png 16 October, 2024 | 2:16 PM

ట్రంప్‌తో అమెరికాకు ప్రమాదం

16-10-2024 03:50:42 AM

ఆయన ఓ చంచల స్వభావి

ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారు

డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఆరోపణ

వాషింగ్టన్, అక్టోబర్ 15: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాకు ప్రమాదకరంగా మారతారని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఆరోపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యార్థులను, జర్నలిస్టులు, జడ్జిలు, ఎలక్షన్ అధికారులను టార్గెట్ చేసుకుని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతారని అన్నారు.

తన ను రాజకీయంగా వ్యతిరేకిస్తున్న వారిని దేశానికి శత్రవులుగా భావించి వారిపై ఆర్మీని ఉపయోగించి వేధిస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో నిర్వ హించిన ఓ టీవీ షోలో కమల పాల్గొని ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ట్రంప్ ఓ చంచల స్వభావి అని, అయన ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఎద్దేవా చేశా రు.

ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికా ప్రజల స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొంతమంది తీవ్ర భావజాలంతో ఉన్నారని, వారితోనే మనకు ప్రమాదమని పేర్కొన్నారు. ఎన్నికల రోజు ట్రంప్ మద్దతు దారులు విపరీత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, వాటి కారణంగా తాను ఎటువంటి ఆందోళన చెందనని ఆమె స్పష్టం చేశారు.