* అపాయింట్‌మెంట్ వెయింటింగ్ సమయం తగ్గింపునకు చర్యలు
* జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు
* ప్రకటించిన అమెరికా ఎంబసీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్ విషయంలో భారతీయులకు అమెరికా తీపి కబురు చెప్పింది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితిని తగ్గించేందుకు షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్‌లో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు భారత్‌లోని యూఎస్ ఎంబసీ గురువారం తెలిపింది. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ను ఒకసారి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌కు తమకు నచ్చిన లొకేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఒకసారి ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత కూడా అపాయింట్‌మెంట్‌ను మిస్ అయితే కొత్తగా మరోసారి ఫీజు చెల్లించి అపాయింట్ కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అపాయింట్‌మెంట్ ప్రక్రియను సరళతరం, వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ఎంబసీ వివరించింది. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అక్రమంగా అమెరికాకు వెళ్లలేరు
అమెరికాకు వెళ్లడమనేది చాలా మంది భారతీయుల కల. ఇందుకోసం కొందరు అక్ర మ మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రా ణాలను పణంగా పెట్టి మరీ కెనడా గుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తుంటారు. అయితే ఇకపై భారతీయులు కెనడా గుండా అమెరికాలోకి ప్రవేశించడం మరింత కఠినతరం కానుం ది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. సరిహద్దుల్లో కెనడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేయటం లేదని తాజాగా మండిపడ్డారు.
దీంతో కెనడా సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమవలసదారులు ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ దీన్ని అడ్డుకోవడానికి కెనడా చర్యలు తీసుకోకుంటే తాను అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 25శాతం సుం కం విధించనున్నట్టు హెచ్చరించారు. దీంతో కెన డా ప్రభుత్వం అలెర్ట్ అయింది. 900 మిలియ న్ డాలర్లతో కెనడా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అమలు అయితే కెనడా గుండా అక్రమవలసలకు అడ్డుకట్ట పడనుంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 7.25లక్షల వరకూ ఉంది.
జీ20 టాలెంట్ వీసాకు హోంశాఖ ఆమోదం
ఆవిష్కరణల్లో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జీ20 దేశాల్లోని శాస్త్రవేత్తలను, పరిశోధకులను, స్కాలర్లను భారత్‌కు రప్పించడం కోసం జీ20 టాలెంట్ వీసాను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా జీ20 టాలెంట్ వీసాకు హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ వీసాను ఎస్ స్టూడెంట్ వీసా సబ్ క్యాటగిరీలో చేర్చింది. జనవరి 1, 2025 నుంచి ఈ వీసా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీసాకు హోంశాఖ ఆమోదం తెలిపిన విషయాన్ని యూజీసీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమావేశాల్లోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ వీసాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.