- చట్టసభలో ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు
- 8.75 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం
- నిలిచిపోనున్న పాలనాపరమైన కార్యక్రమాలు
- వాషింగ్టన్, డిసెంబర్ 20: పాలనా పరమైన కార్యకలాపాలు స్తంభించడం, ఉద్యోగుల వేతనాలకు సంబంధిన కీలక బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అమెరికాకు షట్‌డౌన్ ముప్పు పొంచి ఉన్నది. ద్రవ్య వినిమియ బిల్లుపై మరో మూడువారాల్లో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిం చనున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తన మాటే నెగ్గాలని పట్టుబడుతున్నారు. మరోవైపు తమ నిర్ణయమే నెగ్గాలని ప్రస్తుత అధ్యక్షుడు జోబైడన్ వర్గం సైతం పంతం పట్టారు.
- దీంతో బిల్లు పెండింగ్‌లో పడింది. సాధారణంగా అక్కడి ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చట్టసభలో ద్రవ్య వినిమయబిల్లు ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగానే జోబైడన్ ఇటీవల ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. బిల్లును డొనాల్డ్ ట్రంప్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ప్రతిపాదనలను కూడా బిల్లులో నమోదు చేయాలని పట్టుబట్టింది. వారి ప్రతిపాదనలను జోబైడన్ తిరస్కరించారు.
- ట్రంప్ అడిగినట్లు బిల్లులో మార్పులు చేయలేమని తేల్చిచెప్పారు. తర్వాత చట్టసభలో బి ల్లు ప్రవేశపెట్టారు. 235 ఓట్ల తేడా తో సెనేట్ బిల్లును తిరస్కరించింది. బిల్లు ఆమోదం పొందితే తప్ప జోబైడన్ ప్రభు త్వం ఆర్థిక సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదు. దీంతో అనివార్యంగా అమెరికా షట్‌డౌన్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం..
సమస్యకు పరిష్కారం లభించిన తర్వాతే పెండింగ్ వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండడంతో దేశవ్యాప్తంగా 8.75 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడనున్నారు. షట్‌డౌన్ నేపథ్యంలో వీరంతా సెలవులపై వెళ్లనున్నారు. కానీ, దేశానికి అత్యవసర సేవలందించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 14 లక్షల మంది మాత్రం సేవల్లో కొనసాగుతారు.వీరికి నెలనెలా సక్రమంగా వేతనం అందుతుందా.. లేదా? అన్న విషయమూ సందిగ్ధంలోనే ఉంది.
అలాగే వైద్యరంగం, దేశ భద్రత రంగంలో పనిచేస్తున్న వారు సైతం అత్యవసర సేవలు అందించాల్సి ఉంటుంది. దేశంలోనెలకొన్న విపత్కర పరిస్థితులపై అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా గతంలోనూ అనేకసార్లు షట్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొన్నది.
2018 19లో నెల రోజుల పాటు షట్‌డౌన్‌ను ఎదుర్కొన్నది. నాడు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఒక్కసారి షట్‌డౌన్ వస్తే అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? అనే అంశాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నది.