calender_icon.png 22 December, 2024 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మకు అమెరికా

07-10-2024 02:38:22 AM

మన పండుగకు అమెరికా రాష్ట్రాల అధికారిక గుర్తింపు

నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా గవర్నర్ల ఉత్తర్వులు

‘తెలంగాణ హెరిటేజ్ వీక్’గా బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పండుగకు అమెరికా జై కొట్టింది. అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు లభించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాల్లో బతుకమ్మను అధికా రికంగా గుర్తిస్తూ.. గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, ఈ వారాన్ని తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు.

ఇప్పటికే బతుకమ్మ వేడుకను వైట్ హౌజ్, ఆస్ట్రేలియా ఒపేరా హౌజ్, లండన్ బ్రిడ్జ్, ఐపిల్ టవర్ ఇలా పలు చోట్ల జరుపుకొంటున్నారు. ఈ క్రమం లో తాజాగా యూఎస్‌లోని నాలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అయిన బతుకమ్మను అధికారికంగా గుర్తించడంపై ప్రవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కొంత కాలంగా బతుకమ్మకు ఖండాంతరాల్లో వైభవం తీసు కొచ్చేందుకు కృషిచేస్తున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ ప్రవా సులు కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలితంగా నాలుగు రాష్ట్రాల గవర్నర్ల ఉత్త ర్వులు జారీచేశారు. గతంలో కొన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు బతుకమ్మను అధికారికంగా గుర్తించాయి.