10-03-2025 11:37:07 PM
యూఎస్ ఎయిడ్‌పై అమెరికా నిర్ణయం..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ఎయిడ్ ద్వారా చేపడుతున్న అనేక కార్యక్రమాలకు అమెరికా ముగింపు పలికింది. వాటికి ఇక మీదట నిధులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. ఇక మీదట కొన్ని కార్యక్రమాలకే ఈ కార్యక్రమం కింద సాయం అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘5200 కార్యక్రమాల కాంట్రాక్టులు రద్దు చేశాం. ఎన్నో వేల డాలర్లను ఇన్ని రోజులు ఖర్చు చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు డోజ్ సంస్కరణల వల్ల వీటికి ముగింపు పలుకుతున్నాం. ఎంతో శ్రమించిన డోజ్ సిబ్బందికి ధన్యవాదాలు. కాంగ్రెస్‌లో సంప్రదింపుల అనంతరం కొన్ని కార్యక్రమాలనే కొనసాగించాలని నిర్ణయించాం’. అని ట్వీట్ చేశారు. డోజ్ సారధిగా ఉన్న మస్క్ సూచన మేరకు అమెరికా యూఎస్ ఎయిడ్ కింద వివిధ దేశాలకు చేస్తున్న సాయాలను కట్ చేస్తూ వస్తోంది.