calender_icon.png 28 February, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబల్ బెడ్‌రూంలకు సదుపాయాలు

28-02-2025 02:12:51 AM

ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 27: పది రోజుల్లోగా డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు నివాసయోగ్యంగా చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల లో వెలసిన శివుణ్ణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అర్బన్ హౌసింగ్ కాలనీ నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రు.32 కోట్లు మంజూరు చేయగా డబల్ బెడ్ రూం ఇండ్ల పనులను,డ్రైనేజీ లు,ట్రాన్స్ ఫార్మర్ లు,సెప్టిక్ ట్యాంక్,వివిధ అభివృద్ధి పనులను అధికారులు,ప్రజా ప్రతినిదులతో కలిసి  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008 కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ కాలని గా ఏర్పడి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం 4000  డబల్ బెడ్ రూం ఇండ్ల ను 2018 లో మంజూరు చేసిందన్నారు.

కాంట్రాక్టర్ మధ్యలో 2020 వరకు ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ముందుకు కదల్లేదన్నారు. అయితే తాను చొరవ చేసుకొని మరో కాంట్రాక్టర్ ద్వారా కింద నిర్మాణాన్ని పూర్తి చేయించడం జరిగిందన్నారు. డబల్ బెడ్ రూం ఇండ్ల కు నీళ్ళ సౌకర్యం కోసం 10 కోట్ల వరకు పనులు పూర్తి అయ్యాయని, కానీ బిల్లులు రాని పరిస్తితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి ని కలవగా  డబల్ బెడ్ రూం ఇండ్ల అభివృద్ధికి నిదులు మంజూరుకు హామీ ఇచ్చి కలిసి పనిచేద్దాం అని తనను ఆహ్వానించారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ,మంత్రి పొంగులేటి  చొరవతో రు.32 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.  పేద ప్రజల కోసమే,పట్టణ అభివృద్ది కోసమే పార్టీ  మారడం జరిగిందన్నారు. 20 వేల మందికి గూడు కల్పించిన సంతృప్తి తనకు చాలని ఎమ్మెల్యే అన్నారు.

10 రోజుల్లో ప్రజలకు మంజూరు చేసిన ఇండ్లకు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి ని సైతం కలవడం జరిగిందని,అమృత్ కార్యక్రమంలో భాగంగా రు .38 కోట్లు పట్టణానికి మంజూరు అయ్యాయన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు అడువాల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, క్యాదాసు నాగయ్య, మాజీ కౌన్సిలర్లు డిష్ జగన్, కూసరి అనిల్ తదితరులు ఉన్నారు.