calender_icon.png 5 November, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్దానీ పెంచాలి.. కానీ ఎలా?

05-11-2024 12:14:17 AM

  1. జాయింట్ వెంచర్స్ ఆస్తుల వివాదాలకు ముగింపు పలుకుదాం
  2. సమస్యల పరిష్కారానికి అధికారులతో కమిటీ
  3. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు
  4.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  5. రిసోర్స్ మొబైల్ జేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ఖజానాకు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు. నెలనెలా నిర్వహణ చాలా కష్టంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకోవడంపై తీవ్రమైన ప్ర యత్నాలు చేస్తోంది. ఆమ్దానీని పెంచుకోవడా నికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించు కోవాలని సర్కారు భావిస్తోంది.

అందులో భాగంగా  రాబడిని పెంచుకోవడంతో పాటు ఉపాధి, ఉద్యోగాల అంశంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, దుద్దిళ్ల్ల శ్రీధర్‌బాబుతో కూడిన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ జాయింట్ వెంచర్స్‌లో అనేక విలువైన ఆస్తులు ఉన్నాయని, కొందరు ప్రైవే ట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పా టు చేసి సమస్యను పరిష్కరించి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు.  

జీరో కాలుష్యం ఉండేలా చర్యలు  

మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియ గురించి అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కొంతభాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేలా చేయలాని సూచించా రు. అలాగే రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెం డింగ్‌లో ఉన్న ప్లాట్ల స్థితిగతులపై కూడా సబ్ కమిటీ ఆరా తీసింది.

హైదరాబాద్‌లో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను మంత్రులు ఆదేశించారు. కాలు ష్య పరిశ్రమల నిర్వాహకులు తాము నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్తామని సబ్‌కమిటీకి విజ్ఞప్తులు చేస్తున్నారని గుర్తు చే శారు. వారి వినతులను పరిశీలించి ఓఆర్‌ఆర్ బయట పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాలని చెప్పారు. 

నియోజకవర్గ కేంద్రాల్లో పార్కులు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కు ని ర్మించాలని అధికారులకు మంత్రులు ఆదేశా లు జారీ చేశారు. పరిశ్రమలను ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థి క చేయూత లభిస్తుందన్నారు. సబ్‌కమిటీ స మావేశంలో చర్చించిన అంశాలు మినిట్స్ రూపంలో నమోదు చేసి, మరో వారంలో జరి గే సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి నివేదికతో హాజరు కావాలని ఆదేశించారు.

సమా వేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రా వు, మున్సిపల్ అడ్మినిస్ట్రేష న్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, సీసీఎల్‌ఏ చీఫ్ సెక్రటరీ, రెవె న్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెట రీ జయేశ్ రంజన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ , రంగారెడ్డి, సంగారెడ్డి జిలాల్ల కలెక్టర్లు నారాయణరెడ్డి, క్రాంతి తదితరులు హాజరయ్యారు.