calender_icon.png 4 April, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొద్దు తిరుగుడు పంట కొనుగోలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్

03-04-2025 04:39:29 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గురువారం మద్నూర్ మార్కెట్ యార్డ్ లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రంను మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ గురువారం ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ సౌజన్య మాట్లాడుతూ... ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 7280 రూపాయలు ఉన్నది కావున రైతులందరూ ఏఎంసి నందు సూర్య పువ్వుల పంట అమ్ముకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్  వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షుడు దారాస్ సాయిలు, చావ్ వుల వార్ హనుమాన్లు, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్, సొసైటీ సెక్రటరీ బాబురావు, సొసైటీ సిబ్బంది విట్టల్, సునీల్ మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు, విస్తరణ అధికారి సౌమ్య, సంపత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.