09-03-2025 05:32:00 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు కళ్యాణ మండపంలో ఆదివారం నాడు జరిగిన ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన తోటవార్ పద్మ కుమారుడు ధన్ రాజ్ వివాహ వేడుకలకు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి సతీ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజన తాంబూలాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సహకార సంఘ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, సంజీవరెడ్డి, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.