నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో ప్రభుత్వం 108 అంబులెన్స్ ను మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవలను బుధవారం ప్రారంభం చేశారు. సోను గ్రామంలో 108 సేవలు ప్రారంభించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలాల కేంద్రానికి అంబులెన్స్ మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.