calender_icon.png 22 December, 2024 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివైడర్‌ను ఢీకొన్న అంబులెన్స్

13-09-2024 12:00:00 AM

  1. చికిత్సకు తరలిస్తున్న బాలుడు మృతి 
  2. తల్లిదండ్రుల కండ్లెదుటే మరణం 
  3. ఎన్‌హెచ్ 161పై కన్నీళ్లు తెప్పించిన ఘటన

కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): విధి ఆడిన వింత నాటకంలో ఐదేళ్ల బాలుడు ఓడిపోయాడు. కన్న బిడ్డ కండ్లముందే విలవిల కొట్టుకుంటూ ఉంటే ఆ తల్లితండ్రులకు ఏమి చేయాలో తెలియక దుక్క సాగరంలో మునిగిపోయారు. మహారాష్ట్రలోని దేగావ్‌కు చెందిన మానే ఉమా కాంత్ కుమారుడు సాత్విక్ (5) అనారోగ్యానికి గురికాగా చికిత్స నిమిత్తం హైదారాబా ద్‌కు తరలించారు.

చికిత్సకు ఖర్చు ఎక్కువ ఖర్చు అవుతుండటంతో దెగ్లూర్‌లో చికిత్స చేయించాలని నిర్ణయించుకుని తిరిగి తరలిస్తుండగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి సమీపంలో 161 హైవేపై గురువారం ఉదయం 4 గంట ల సమయంలో అంబులెన్స్ డివైడర్‌ను డీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. దీంతో అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై ఉన్న బాలుడు వైద్యం అందక మృతిచెందాడు.

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మరో అంబులెన్స్‌ను రప్పించినప్పటికి అందులో వెంటిలేటర్ లేకపోవడంతో సరైన వైద్యం అందక సాత్విక్ తల్లిదండ్రుల కండ్లముందే కన్నుమూశాడు. బాలుడి తండ్రి ఉమాకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు.