10-04-2025 12:06:41 AM
నిజామాబాద్ , ఏప్రిల్ 9: (విజయ క్రాంతి): అథాంగ్ టోల్ ప్లాజా వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిస్బిలిటీ (CSR) కింద నిజామాబాదు జిల్లా మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ౩౦ లక్షల విలువ చేసే అంబులెన్సు వాహనమును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అంద అందజేశారు.
ఇ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా అందజేసిన అంబులెన్సు జిల్లా ప్రజలకి ఉపయోగ పడేలా వినియోగించుకోవాలని డి ఎం హెచ్ ఓ కు కలెక్టర్ సూచించారు. ఇదే విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చి సి ఎస్ ఆర్ కింద ప్రజలకి ఉపయోగపడేలా సాంఘిక బాధ్యతగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ జిల్లాలోని కంపెనీలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్, జిల్లా ఆరోగ్య శాఖా అధికారి రాజశ్రీ , జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్ గేట్ మేనేజర్ అనిల్ వారి సిబ్బంది విరాజ్, సతీష్, పాల్గొన్నారు.