calender_icon.png 20 April, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంబులెన్స్ డ్రైవర్

17-04-2025 01:11:36 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అంబులెన్స్ డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే...  ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అంబులెన్స్ డ్రైవర్ రమేశ్ పట్టుబడ్డాడు.

మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఆటో, అంబులెన్స్, 14 బైకు లు సహా మొత్తం 16 మంది పట్టుబడ్డారు. తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్త్స్ర కృష్ణ, సిబ్బంది  పాల్గొన్నారు.