జలమండలి ఎండీ, ఈడీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): అంబర్‌పేట్ ఎస్టీపీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, మార్చి 1లోపు పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ పేర్కొన్నారు. ఆదివారం వారు అంబర్‌పేట్ ఎస్టీపీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సివిల్ పనులు పూర్తయ్యాయని, ఎలక్ట్రో, మెకానికల్ పనులు జరుగుతున్నాయని అధికా రులు వారికి తెలిపారు. ఎస్టీపీకి విద్యుత్ సరఫరా పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అంతర్గత రోడ్డు, సుందరీకరణ పనులు పూర్తి చేయాలన్నారు.