కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): అంబర్‌పేటలో రోడ్డు విస్తరణను అడ్డుకునేందుకు కొందరు రాత్రికి రాత్రే ప్రార్థనా మందిరాలను నిర్మిస్తున్నారని..అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాంనగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఆయన విద్యార్థులకు నోట్ బుక్స్, పోలీస్ బాలుర హైస్కూల్‌కు ఫర్నీచర్‌ను పంపిణీ చేశారు.
అంబర్‌పేటలో రోడ్డు విస్తరణకు తక్షణమే భూసేకరణ పూర్తిచేయాలన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లి మృతిచెందిన వారి కుటుంబాలను భోలక్‌పూర్‌లోని వారి నివాసాలకు వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వారిని పరామర్శించారు.