03-04-2025 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : అంబర్‌పేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.5కోట్ల వ్యయంతో చేపట్టనున్న 30పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు త్వర గా చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం అంబర్పేట్ ఎంసిహెచ్ కాలనీ లోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని అక్కడికి వచ్చిన గర్భిణీలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్, ఇంజక్షన్ రూమ్ తనిఖీ చేసి రిజిస్టర్ లను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో చెత్త వేసే వారికి పెనాల్టీ వేయాలని, వినకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాం ట్ పనిచేసేలా చూడాలని డీసీహెచ్ ఎస్‌కు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, డిసిహెచ్ ఎస్ రాజేందర్, ఆర్డీవో రామకృష్ణ, డిఈఈ జగదీష్ ప్రసాద్, శివ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ దక్షిని, రేంజ్ ఆఫీసర్ అరుణ తదితరులు పాల్గొన్నారు