10-03-2025 05:48:37 PM
గోదావరిఖని (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా సోమవారం బాధ్యతలు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా పోలీస్ కమీషనరేట్ చేరుకొని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ తాజా మాజీ పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ నుండి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీస్ అధికారులు, నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేస్తాం
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా..
రామగుండ కమీషన్ రేట్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేస్తామని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతమైన విలేకరులతో మాట్లాడుతూ... కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తు, సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికీ, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని నేరాల నియంత్రణకు కృషి చేస్తాము. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణా పట్ల ఉక్కు పాదం మోపుతాం. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల ప్రజల సహకారంతో ముందుకెళ్తాము.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తూ, చట్ట పరిది లో సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తామని , ఏవైన ఇబ్బందులు ఎదురైతే నేరుగా అందుబాటులో వున్న డీసీపీలతో పాటు తనను కూడా నేరుగా కలువ వచ్చని వారికీ అండగా పనిచేస్తామన్నారు. 2009 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా 2011 లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎ.ఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్ డి గా, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తోలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగాను ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు.
గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొంది రాచకొండ జాయింట్ సీపీగా పనిచేశారు. అనంతరం వరంగల్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమీషనర్ గా నియమించబడ్డారు. నూతన సిపిని మర్యాదపూర్వకంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్, పెద్దపల్లి డీసీపీ పి.కరుణకార్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ఎసిపిలు, ఇన్సెస్నెక్టర్లు, ఏ ఆర్ ఏసీపీ లు, ఆర్.ఐలు ఇతర విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఉన్నారు.