15-04-2025 01:38:02 AM
కరీంనగర్/జగిత్యాల, పెద్దపల్లి,సీరిసిల్ల ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వ పనిచేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్వాయ్, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు అందడం కోసం అనేక చట్టాలను రూపొందిస్తున్నామని తెలిపారు. సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యువతకు వివిధ పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీసెస్లో మెయిన్స్కు అర్హత సాధించిన వారికి లక్ష రూపాయల ఉపకార వేతనం అందజేస్తున్నామని తెలిపారు.
30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజున అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి, కబ్జాల నియంత్రణకు ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజున అమలు చేయడంతో మరో మంచి విషయముని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. ఎంఎస్‌ఈల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
అంబేద్కర్ రచించిన అనేక పుస్తకాలను చదువుకునేందుకు, ఆయన ఆలోచనలను, బోధనలను స్మరించుకునేందుకు కరీంనగర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్యాన కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి పవన్ కుమార్, పలువురు ప్రజా సంఘాల నేతలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కొత్తపల్లిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రోళ్ల మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, నూజీ ఎంపీపీ వాసాల రమేష్, నాయకులు పొన్నం సత్యంగౌడ్, జమీలుద్దీన్, గోనె రవి, చంద్రపల్కల అజయ్, వేముల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, బంచారి వేణు, బీఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డు ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు చౌకత్.
నాయకులు గంగాధర చందు, రవి నాయక్, రవివర్మ, బొంకూరు మోహన్, చుక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి ప్రవీణరావు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ నృజన్ కుమార్, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పిట్టల నమ్మయ్య, బూడిద సదాశివ, బ్రాహ్మణపల్లి యుగంధర్, చెంచాల మురళి, హేమంత్, నల్లగొండ శ్రీను, సత్యనారాయణచారి, సాంబరాజు, తిరుపతిరెడ్డి, జంగ కొమురయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కమిషనర్ చాహత్ బాజాపాయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణు మాధవ్, నాయకులు నుంచు నరేష్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.