calender_icon.png 19 April, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం

15-04-2025 12:00:00 AM

  1. అంటరాని తనం నిర్మూలనకు ఎనలేని కృషి: ఎమ్మెల్యే లక్ష్మి 
  2. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే హరీష్‌బాబు హాజరు 
  3. రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబే ద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అంబేద్కర్ సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, వివిధ సంఘాల నాయకులు అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశాడని కొనియాడారు.  న్యాయవేత్తగా కీర్తిగాంచి, భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమకాలిన హక్కు లు, అంటరాని తనం నిర్మూలన కోసం ఎనలేని కృషిచేసిన మహానీయుడన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర చాలా కీలకమన్నారు.

వారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు మనం ఈ స్థాయి లో ఉన్నామని తెలిపారు. రాజ్యాంగంతోనే చట్టాలను రూపొందించడం జరుగుతుందని వివరించారు. అదనపు కలెక్టర్ దీపక్ మాట్లాడుతూ.. అసమానతలు కులవివక్ష ఉన్న రోజుల్లో అత్యున్నత చదువులు చదివి రెండు యూనివర్సిటీలలో నుండి డాక్టరేట్ పొంది భారతరత్నగా  పేరుగాంచారని కొనియాడారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దీంతోపాటు కాగజ్‌నగర్ చింతలమానపల్లి మండలాల్లో ఎమ్మెల్సీ దండే విఠల్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మొక్కను నాటారు. కాగజ్ నగర్‌లో బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఎమ్మె ల్యే పాల్వాయి హరీష్‌బాబు దీంతోపాటు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమా లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డివో సజీవన్, డీపీఓ బిక్షపతి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ వివిధ సంఘాల నాయకులు తుకారం, అశోక్, తిరుపతి, బాపు, కేశవరావు, రమేష్, మంగాజి, తదితరులు పాల్గొన్నారు.