calender_icon.png 28 December, 2024 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

06-12-2024 05:52:22 PM

మందమర్రి (విజయక్రాంతి): అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు మండలంలోని పొన్నారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులకోసం, సమాజంలోని అసమానతలను రూపు మాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాధించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు బొజ్జ రాములు, బేర సమ్మయ్య, నీలం మల్లేష్, కాపురం సతీష్, గోసిక వినయ్, తాటికొండ భీమయ్య, మాసు నల్లయ్య, వేల్పుల వర్షిత్, కాపురం సంతోష్ లు పాల్గొన్నారు.

ఆదిల్ పేటలో...

మండలంలోని ఆదిల్ పేట గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మాజీ జడ్పీటిసి సభ్యులు వేల్పుల రవి, మండల బిఆర్ఎస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆకుల చందు, జంపన్న, వేల్పుల సునీల్, సతీష్, సాగర్ మదునయ్య, రాజన్నలు పాల్గొన్నారు.