calender_icon.png 26 December, 2024 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అందరికీ హక్కులు

06-12-2024 04:22:29 PM

వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉట్నూర్ లోని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ మేధావి భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డా. దాసండ్ల ప్రభాకర్ ఎమ్మెల్యేని సన్మానించి, భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ యువజనా విభాగం అధ్యక్షునిగా ఎన్నికైన ఆత్రం రాహుల్, అర్కిలా పరమశ్వర్ లను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజు హ్యాపీగా బ్రతుకగలుగుతున్నామని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డైరెక్టర్ ఎస్.పి రెడ్డి, ఎ.ఏం.సి వైస్ ఛైర్మెన్ జైవంత్, చంద్రయ్య, కాయ్యుమ్ నిస్సార్, రాజేశ్వర్, రాధాబాయి, మారసుకోలా తిరుపతి, లాజర్, అశోక్, భీమన్న, పోషన్న, జాదవ్ రాజేష్, మహబూద్, ప్రభాకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.